తిరుమల శ్రీవారిని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యుల (Nara Lokesh Family)తో కలిసి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నారా లోకేష్ తోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ నేతలు కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. నారా దేవాన్ష్ (Nara devansh) పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు భువనేశ్వరి (Nara Bhuvaneswari), లోకేష్ దంపతులు అన్నప్రసాద వితరణ చేసారు. 9వ పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ 38 లక్షలు టీటీడీ (TTD) ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళంగా నారా లోకేష్ ఇచ్చారు. బంతిలో కూర్చున్న భక్తులకు అల్పాహారంగా పొంగలి, చట్నీ, సాంబార్ వడ్డించారు. భక్తిశ్రద్ధలతో భక్తులను అప్యాయంగా పలకరిస్తూ అన్నవితరణ చేసారు నారాలోకేష్. భక్తులతో కలిసి బంతిలో కూర్చోని నారా లోకేష్ దంపతులు, దేవాన్ష్ అన్నప్రసాదం భుజించారు. తరువాత అన్నప్రసాద భవనంలోని వంటశాలను సందర్శించి, అన్నప్రసాదం తయారీ విధానాన్ని పరిశీలించారు, రోజుకు ఎంతమంది భక్తులకు అన్నదానం చేస్తారు. తదితర వివరాలను అధికారులను అడిగి లోకేష్ తెలుసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మూడు రోజుల్లో 385 ఎఫ్ఐఆర్లు దాఖలు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి