కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ కే. సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఈ నెల 16 వ తేది న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపద్యంలో ఎం.సి.సి, ఫ్లయింగ్ టీమ్ ద్వారా నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సువిధా యాప్ ద్వారా వారు నిర్వహించుకునే సభ లకు ముందస్తుగా అనుమతులు తీసుకోవాలనీ సూచించారు. ప్రలోబలకు, బెదిరింపులకు పాల్పడిన, ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన సి విజిల్ యాప్ ద్వారా ఎవరైనా కంప్లయింట్ ఇవ్వాలని సూచించారు. ఎన్నికలు సచువుగా శాంతియుతంగా జరిగే విధంగా ఎన్నికల సంఘం ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సభలు, ర్యాలీలు నిర్వహించుకోవాలంటే సువిధ యాప్ ద్వారా 48 గంటల ముందు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో నిర్వహించే విధంగా అందరు సహకరించాలని కోరారు.
కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం…
129
previous post