సుప్రీంకోర్టు (Supreme Court)
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ ఆస్తుల కేసులో డీఎంకే నేత కె. పొన్ముడికి దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షపై మార్చి 11నే తాము స్టే విధించామన్నారు. అయితే గవర్నర్ తెలిసినా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. పొన్ముడిని తిరిగి తమిళనాడు మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు డీఎంకే ప్రభుత్వం సిద్ధమైనా.. అందుకు అనుమతి ఇవ్వకుండా గవర్నర్ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ఈ కేసులో గవర్నర్ తీరుపై మేం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాని తెలిపింది. గవర్నర్ సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్ముడికి పడిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిందనే విషయాన్ని గవర్నర్‌కు సెపరేటుగా చెప్పాల్సిన పనేం లేదని తెలిపారు. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి రిక్వెస్ట్ చేయడంతో.. ఈ అంశంపై గవర్నర్ ఆర్‌ఎన్ రవి వైపు నుంచి చర్యల కోసం రేపు సాయంత్రం వరకు వేచి చూస్తామని సీజేఐ చెప్పారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి