శ్రీశైలం (Sri sailam) శిఖరేశ్వరం సమీపంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి (Ishtakameshwari ammavaru) టికెట్ కౌంటర్ వద్ద భక్తులు ఆందోళన (Devotees Darna)కు దిగారు. రోడ్డుపై భైఠయించి కొంతసేపు దర్నా చేశారు. అమ్మవారి అలయ దర్శనానికి భక్తులు వెళ్లకుండా గిరిజనులు గేట్ దగ్గర అడ్డుకున్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లెందుకు ఒకరోజు ముందుగానే భక్తులు టికెట్లు కొనుగోలు చేశారు. అయితే అమ్మవారి దర్శనానికి వెళ్లెందుకు శ్రీశైలం నుంచి శిఖరేశ్వరం టికెట్ కౌంటర్ వద్దకు ఉదయం ఏడుగంటలకే భక్తులు చేరుకున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించక పోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. దర్నాకు కూర్చున్నారు. రోడ్డుపై వాహనాలను నిలిపివేసి దర్న చేశారు. ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి అనుమతి లేకుంటే రాత్రే చెప్పాలని భక్తులు అటవీశాఖ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
విషయం తెలుసుకున్న శ్రీశైలం పోలీసులు దర్నా జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని భక్తులకు సర్ధి చేప్పే ప్రయత్నం చేశారు. దర్నాలు చేయకుడదంటూ పోలీసులు భక్తులను రహదారి నుంచి పక్కకు పంపారు. అయితే గత మూడు రోజులుగా అమ్మవారి దర్శనానికి టికెట్లు కోసం శ్రీశైలం నుంచి అడవిమార్గంలోని శిఖరేశ్వరం పైఎత్తున ఉన్న కౌంటర్లు వద్దకు అష్టకష్టాలు పడి టికెట్లు తెచ్చుకుంటే ఇప్పుడు అమ్మవారి దర్శనానికి పంపించడం లేదంటూ భక్తులు అటవీశాఖ సిబ్బందిపై మండిపడ్డారు. అటవీశాఖ అధికారులకు గిరిజనులకు మధ్య అంతర్గత వివాదాలను భక్తులపై చూపుతున్నారని భక్తుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని భక్తులు అటవీశాఖ సిబ్బందిపై మండిపడ్డారు. భక్తులకు అటవీశాఖ సిబ్బందికి కొంతసేపు వాగ్వివాదం జరిగింది. విషయం అటవీశాఖ పైస్దాయి అధికారులకు సిబ్బంది తెలుపడంతో పైస్దాయి అధికారులు వచ్చి భక్తులను ఓదార్చి గిరిజనులతో చర్చలు జరిపి అనంతరం మద్యాహ్నం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమత్తిచ్చారు. అయితే రేపటికి టికెట్లు ముందస్తుగా ఇవ్వడంలేదని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు నక్కెంటి బీట్ రెంజర్ తెలిపారు.
ఇది చదవండి: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి దామోదర రాజ నరసింహ..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి