కోర్టు(Court) అనుమతిస్తే.. జైల్లోనే సీఎం కార్యాలయం..
జైలు నుంచే ఢిల్లీ(Delhi) సీఎంగా అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పరిపాలనను కొనసాగిస్తారని ఆప్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం సాయంత్రం ఆప్ సీనియర్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్(Bhagwant Singh Man) అదే తరహా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కేజ్రీవాల్ విడుదలయ్యే దాకా జైలు నుంచే ఢిల్లీని పరిపాలిస్తారు. జైల్లో సీఎం కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం’’ అని ఆయన చెప్పారు.‘‘జైలు నుంచి ముఖ్యమంత్రి పరిపాలన చేయకూడదని ఎక్కడా చెప్పలేదు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అయితే జైలుకు వెళ్లినంత మాత్రాన ఏ వ్యక్తి కూడా నేరస్థుడు కాడని చట్టం చెబుతోంది. ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు జైల్లోనే కార్యాలయం ఏర్పాటు చేయించాలని సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం’’ అని భగవంత్ మాన్ తెలిపారు. ఆమ్ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ స్థానాన్ని ఏ ఒక్కరూ భర్తీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. ఇక కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన చేయడం సాధ్యమయ్యే విషయమేనని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఇది చదవండి: భారత్తో సయోధ్యకు వచ్చిన మాల్దీవులు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి