వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy)కి అపూర్వ స్వాగతం
నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి కందుకూరు నియోజకవర్గం ప్రజలు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. వేలాదిగా తరలివచ్చిన మూడు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ స్వాగతించారు. పర్యటన ప్రారంభం నుంచి చివరిదాకా ఫుల్ జోష్ తో కదం తొక్కుతూ అభిమాన నేతను ఆశీర్వదించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అడుగడుగునా నీరాజనం పలికిన కందుకూరు ప్రజానీకం
మొదట సింగరాయకొండ బైపాస్ రోడ్డు వద్ద, నియోజకవర్గ తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar reddy) కి భారీ స్వాగతం పలికారు. అనంతరం నాయకులు కందుకూరుకి చేరుకోగానే భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఎదురు వచ్చి ఆహ్వానం పలికారు. పెద్ద బజారులో గల పొట్టి శ్రీరాములు వద్ద ఆర్యవైశ్యులంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు కి మద్దతు తెలియజేస్తూ గజ మాలతో సత్కరించారు. ఈసారి తామంతా తెలుగుదేశం పార్టీకి మూకుమ్మడిగా ఓట్లు వేసి అభ్యర్థులు ఇద్దరినీ గెలిపించుకుంటామని సంఘీభావంగా తెలియజేశారు. అనంతరం నాయకులు ఆర్యవైశ్య సోదరులతో కొద్దిసేపు మాట్లాడారు. తర్వాత అక్కడ నుంచి ర్యాలీగా పామూరు రోడ్డులో ఎస్వీఎస్ కళ్యాణమండపం చేరుకొని పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
వేలాదిగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు
ఆత్మీయ సమావేశంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం బిజెపి జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని, తిరిగి గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతోనే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసిపి ప్రభుత్వం పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాల్లోనూ పసుపు జెండా ఎగరవేయబోతున్నామని అన్నారు. కందుకూరులో అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ఇంటూరి నాగేశ్వరరావు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారని గుర్తుచేస్తూ, రాబోయే ఎన్నికల్లో ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈసారి ఎన్నికల్లో కందుకూరులో చరిత్ర సృష్టించబోతున్నామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులంతా చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి, పార్టీ గెలుపు కోసం ఈ 55 రోజులు కష్టపడాలని నేతలు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చిన ఇంతమంది అభిమానులను చూస్తుంటే… ఇది పరిచయ కార్యక్రమం లాగా లేదని, విజయోత్సవ సభ లాగా కనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల తరువాత కందుకూరులో ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తానని చెప్పారు. కందుకూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ఒక మోడల్ లాగా తీర్చిదిద్దేలా బాధ్యత తీసుకుంటానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు ఎంపీగా తనను, కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు ను అందరూ ఆశీర్వదించాలని అభ్యర్థించారు.
సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆర్యవైశ్యులు
ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు ఇంచార్జి పదవి వచ్చినప్పటి నుంచి నిత్యం ప్రజల మధ్య తిరిగానని, ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అన్నివేళ అండగా నిలిచానని చెప్పారు. చిన్న వయసులోనే తనపై ఎంత నమ్మకంతో చంద్రబాబు నాయుడు గొప్ప అవకాశం కల్పించారని చెబుతూ.. పార్టీ పెద్దలకు నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజవర్గంలో పార్టీలో అందరిని సమన్వయం చేసుకొని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందన్నారు. పెద్దలు డాక్టర్ దివి శివరాం, సీనియర్ నాయకుల అండదండలు తనకున్నాయని చెప్పారు. ఒకసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజవర్గ ప్రజల రుణం తీర్చుకుంటారని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాట పట్టిస్తారని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వందలాదిమంది వైసిపి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఇది చదవండి: హైదరాబాద్ – కరీంనగర్ ఎలివేటెడ్ కారిడార్ కు గ్రీన్ సిగ్నల్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి