శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవి (Shri Bhramarambikadevi) అమ్మవారికి ఏప్రిల్ 26 న వార్షిక కుంభోత్సవం దేవస్థానం నిర్వహించనుంది. ఈనేపద్యంలో చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం గాని, శుక్రవారం గాని ఏది ముందుగా వస్తే ఆరోజున కుంభోత్సవం నిర్వహించడం దేవస్థానం ఆనవాయితీ అలానే ఈ సంవత్సరం జరిగే కుంభోత్సవానికి సాత్వికబలిగా, కుంభోత్సవానికి ఆరంభ ప్రతీకగా దేవస్థానం ఆధ్వర్యంలో కొబ్బరి, గుమ్మడి, నిమ్మకాయలు సమర్పించడం దేవస్థానం ఆనవాయితీ నేడు మంగళవారం కావడంతో ఉదయం శ్రీస్వామివారి ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి ఇవ్వడం జరిగింది. అయితే మహాశివరాత్రి తర్వాత వచ్చే ప్రతి మంగళ, శుక్రవార రోజుల్లో కొబ్బరికాయలు రాశులుగా పోసి, పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించి అమ్మవారి సింహ మండపం వద్ద సాత్వికబలి సమర్పించడంతో లోక కల్యాణం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. అలానే ఏప్రిల్ 26న అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహిస్తునట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ ఏఈవో హరిదాస్, అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది చదవండి: విజయవాడలోని ఆయిల్ శుద్ధి కేంద్రంలో అగ్ని ప్రమాదం..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి