దేశంలో ప్రధాని మోడీ (Modi) ని చూసి ప్రజలు ఓటు వేస్తారు. మరోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని ఇండియా కూటమి ఏ గుర్తించడం లేదని తనదైన శైలిలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యలు చేశారు.
మరోసారి మోడీ (Modi) ప్రధాని కావడం ఖాయం..
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని నియోజకవర్గ స్థాయి బిజెపి పార్టీ పార్లమెంటు కార్యాలయాన్ని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రారంభించారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలో మరోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని రాహుల్ గాంధీని ఇండియా కూటమి ఏ ప్రధాని అభ్యర్థిగా గుర్తించడం లేదని ఆమె అన్నారు. తెలంగాణలోని 17 సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా అని ఆమె వ్యాఖ్యానించారు.
దేశంలో ప్రధాని మోడీని చూసి ప్రజలు ఓటు వేస్తారు..
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో 28 పార్లమెంటు స్థానాలకు 24 పార్లమెంటు స్థానాల్లో బిజెపి పార్టీ విజయం సాధిస్తుందని అలాగే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు 10 నుండి 12 పార్లమెంటు స్థానాలు బిజెపి పార్టీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి చరిష్మాను చూసి కాదని బిఆర్ఎస్ అవినీతి అక్రమాలను భూ కబ్జాలను భరించలేక ప్రజలు కెసిఆర్ కు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆమె అన్నారు. ఏది ఏమైనా మరోసారి దేశంలో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి