Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home TelanganaHyderabad బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పీఏ అరెస్ట్..

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పీఏ అరెస్ట్..

by Rama
Harish rao

మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు (Harish Rao) మాజీ పర్సనల్ అసిస్టెంట్ (PA) ను హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల దుర్వినియోగం కేసులో హరీశ్ రావు పీఏ నరేశ్ కుమార్ (Naresh kumarJub) ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం అయ్యాయని, అనర్హులకు చెక్కులు అందించారని మెదక్ జిల్లా నారాయణఖేడ్ కు చెందిన రవినాయక్ ఫిర్యాదు చేశారు. తనకు మంజూరైన రూ.5 లక్షల చెక్కును నరేశ్ కుమార్ కాజేశాడని ఆరోపించాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

ప్రాథమిక విచారణ తర్వాత నరేశ్ కుమార్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి హరీశ్ రావు ఆఫీసులో నరేశ్ కుమార్, మరో ముగ్గురు ఆఫీసు సిబ్బంది సీఆర్ఎంఎఫ్ విభాగంలో పనిచేశారు. ఈ క్రమంలోనే చెక్కుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రాథమికంగా ఆధారాలు లభించినట్లు సమాచారం. రవినాయక్ కు చెందిన రూ.5 లక్షల చెక్కును క్యాష్ చేసుకుని నరేశ్, వంశీ, వెంకటేశ్, ఓంకార్ లు పంచుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వారి దగ్గర మరికొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు దొరికినట్లు సమాచారం.

ఇది చదవండి: తాతల ఆస్తికి రాజకీయ రంగు పూయడం పద్దతి కాదు..


హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన …
ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో …

Follow us on: Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019552
Total views : 91074

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.