ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరులో వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు దూలం వినయ్ ప్రెస్ మీట్ నిర్వహించి కైకలూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని విమర్శించే వ్యక్తి అన్ని పార్టీలకు సంబంధించిన బ్రోకర్. పేరుకు డాక్టర్ అని చెప్పుకుంటూ ల్యాండ్ సెటిల్మెంట్లు, మనీ సెటిల్మెంట్లు చేస్తూ అన్యాయంగా సంపాదిస్తూ ఉంటాడు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి రాష్ట్రానికి అంటూ ఏమీ చేయని మంత్రిగా మిగిలిపోయాడు కనీసం నియోజకవర్గం కూడా మంత్రి హోదాలో ఉంటూ అభివృద్ధి చేయించలేకపోయిన దొంగ మంత్రి. పెరిగిన జన్మస్థలం కైకలూరు ఉండేది మాత్రం అమెరికా.
ఈయన గారు చేసే పనులన్నీ అంటే సెటిల్మెంట్లు మనీ సెటిల్మెంట్లు మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. మా పైన చేసే ఆరోపణలన్నీ నిరూపిస్తే మా తండ్రిగారైన దూలం నాగేశ్వరరావు నామినేషన్ వేయకుండా తప్పుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ ఛాలెంజ్ గా తన ఒప్పుకుంటాడా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆయన గారు గెలిచింది. ఒక్కసారే. మేము చిన్నప్పటి నుంచి కష్టపడి వ్యాపారాలు చేసుకుంటూ పైకొచ్చిన వాళ్ళం జనాలను తొక్కుకుంటూ వచ్చిన వాళ్ళం కాదు ఇది తెలుసుకుని ఆయన మంచిగా ప్రవర్తిస్తే మంచిది అని అన్నారు. మేము చిన్నప్పటినుంచి మా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాము.
అంతేగాని అధికారం ఉంది కదా అని అధికారాన్ని మా చేతుల్లోకి తీసుకోలేదు మా దగ్గరకు వచ్చి సాయం అడిగిన ప్రతివారికి మేము సహాయం చేశాం. మరి ఆ మంత్రి గారు పదవిలో ఉన్నప్పుడు ఎంతోమందిపై పోలీస్ కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టించినాడు అక్రమ మైనింగ్లని మాపై ఆరోపణలు చేస్తున్నాడు. నియోజకవర్గంలో హైవే రోడ్లకు వెళ్లే టిప్పర్లు కూడా అక్రమమైన మైనింగ్ అని ఆరోపిస్తే అతన్ని ఏమనాలి అతనొక నాయకుడా అని అన్నారు.