ఆలయ ఈవో డి.పెద్దిరాజు(D. Peddiraja) సమావేశం..
శ్రీశైలం(Srisailam) దుకాణదారులతో ఈవో పెద్దిరాజు సమావేశం భక్తులతో మర్యాదగా మెలగాలిని సూచన. శ్రీశైలం దేవస్థానం(Srisailam Devasthanam) పరిధిలోని దుకాణాదారులతో ఆలయ ఈవో డి.పెద్దిరాజు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సిఐ ప్రసాదరావు(CI Prasada Rao), ఎస్సై లక్ష్మణరావు(SSI Lakshmana Rao), దేవస్థానం రెవెన్యూ అధికారులు, సిబ్బంది స్థానిక దుకాణదారులు పాల్గొన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయని ఈ నేపద్యంలో ఏప్రిల్ 1 నుంచే కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి వచ్చే అవకాశం ఉన్నందన్నారు ఈ సందర్భంలో దుకాణాదారులు భక్తులతో మర్యాదగా మెలగాలని, సంయమనం పాటించాలని సూచించారు అలానే దుకాణాలలో విక్రయించే వస్తువులు, తినుబండారాలు తదితర వాటి ధరల పట్టికను హింది, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు భాషలలో దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు అదేవిధంగా హోటల్ నిర్వాహకులు శుచిశుభ్రతను విధిగా పాటించాలని,
ఎం. ఆర్. పి రేట్లకు విక్రయించాలని సూచించారు అనంతరం స్థానిక సీఐ ప్రసాదరావు మాట్లాడుతూ దుకాణాలలో పనిచేసే పనివారికి కూడా భక్తులతో ఎలా మెలగాలో నిర్వాహకులు అవగాహణ కల్పించాలని, పనివారి ఆధార్ ని కూడా సేకరించి పరిశీలించుకోవాలని అలానే దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇదిచదవండి: నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా పర్యటన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి