Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home National అరేబియా సముద్రంలో దొంగల దాడి..!

అరేబియా సముద్రంలో దొంగల దాడి..!

by Satya
The Indian Navy saved the Pakistanis

పాకిస్థానీలను కాపాడిన భారత నేవీ(Indian Navy):

అరేబియా సముద్రం(Arabian Sea)లో సముద్రపు దొంగల దాడి నుంచి 23 పాకిస్థానీలను భారత నేవీ రక్షించింది. మార్చి 28న ఇరాన్‌కు చెందిన ఓ చేపల బోటుపై సముద్రపు దొంగలు దాడి చేశారని తెలియడంతో రంగంలోకి దిగిన భారత నేవీ 12 గంటల పాటు శ్రమించి దొంగలను అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దాడి గురించి తెలియగానే రెండు యుద్ధ నౌకలను అక్కడికి వెళ్లిన నేవీ సిబ్బంది. 12 గంటల పాటు శ్రమించి నావపై ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు అని నేవీ పేర్కొంది. పడవలోని 23 మంది పాకిస్థానీ సిబ్బందిని రక్షించినట్టు వెల్లడించింది. అనంతరం, నావను క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలిపెట్టామని పేర్కొంది.

ఇది చదవండి: లిక్కర్ కేసుపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు..

సొకొత్రా తీరానికి నైరుతి దిక్కున 90 నాటికల్ మైళ్ల దూరంలో దొంగలు ఆ నావపై దాడి చేసినట్టు వెల్లడించింది. నేవీ ప్రకటన ప్రకారం, తమను రక్షించాలంటూ సిబ్బంది అభ్యర్థించగానే భారత నేవీ రంగంలోకి దిగింది. తొలుత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమేధ.. దొంగలు హైజాక్ చేసిన నావను అడ్డగించింది. ఆ తరువాత.. సుమేధకు తోడుగా ఐఎన్ఎస్ త్రిశూల్‌ కూడా రంగంలోకి దిగింది. సుదీర్ఘ ఆపరేషన్ అనంతరం దొంగలను అదుపులోకి తీసుకుంది. ఈ నెల మొదట్లో భారత నేవీ మరో నౌకను సముద్రపు దొంగల దాడి నుంచి రక్షించింది. భారత తీరానికి సుమారు 2600 కిలోమీటర్ల దూరంలో పైరేట్లు రూయెన్ అనే నౌకపై దాడి చేశారు. ఈ క్రమంలో ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధ నౌక రంగంలోకి దిగి పైరేట్లను తరిమికొట్టింది. ఈ ఘటనలో 35 సముద్రపు దొంగలు లొంగిపోయారు. రూయెన్‌లోని 17 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే …
బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..
ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్ తగిలింది. …
పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ..
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి నిరాకరణతో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008569
Total views : 56858

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.