బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి రాజీనామా చేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి(Kadiam Srihari).. కుమార్తె డాక్టర్ కావ్య(Daughter Dr. Kavya)తో కలిసి కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy), పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. పలువురు నేతలు అధికార పార్టీలోకి వెళ్లగా, మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో సీనియర్ నేతలు అయిన కడియం శ్రీహరి, కేకే వంటి నేతలు పార్టీని వీడడం అన్నింటికంటే ఎక్కువ సంచలనమైంది.
ఇది చదవండి: మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు…
మరీముఖ్యంగా కడియం కావ్యను వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే, దానిని కాదనుకుని మరీ ఆమె పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం సంచలనమైంది. పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాసిన కావ్య.. ఫోన్‌ట్యాంపింగ్, కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు వంటివి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయని, దీనికితోడు లోక్‌సభ అభ్యర్థిని అయిన తనతో నేతలు ఎవరూ కలిసి రావడం లేదని ఆరోపించారు. కాగా, నిన్న జీహెచ్ఎంసీ మేయర్, కేకే కుమార్తె విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి మరికొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి