గూగుల్ తన స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్(Youtube) లో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ పాడ్‌కాస్టర్‌లు, క్రియేటర్‌లకు ఉపయోగకరంగా ఉండనుంది. కొత్త ఫీచర్‌లు పాడ్‌కాస్టర్‌లను YouTubeలో మరింత సులభంగా పోస్ట్ చేసేలా చేస్తాయి. బ్రాండెడ్ కంటెంట్ కోసం సరికొత్త ప్లాట్‌ఫారమ్ తీసుకొచ్చారు. కథలు, అభిప్రాయాలు, జ్యోతిష్యం ప్రేక్షకులతో పంచుకోవడానికి పాడ్‌క్యాస్ట్‌లు ఒక ప్రసిద్ధ మార్గంగా ఉంది. యూట్యూబ్ చాలా కాలంగా పాడ్‌క్యాస్ట్‌లకు నిలయంగా ఉంది. కానీ ఇప్పుడు పాడ్‌క్యాస్టర్ కంటెంట్‌తో డబ్బు ఆర్జించించవచ్చు. పాడ్‌కాస్టర్‌లు తమ పాడ్‌క్యాస్ట్‌లను యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్‌లో సులభంగా పబ్లిష్ చేయడానికి యూట్యూబ్ స్టూడియోలో కొత్త ఫీచర్‌లను YouTube విడుదల చేస్తోంది. పాడ్‌క్యాస్ట్‌లు యూట్యూబ్ మ్యూజిక్ హోమ్‌పేజీలోని పాడ్‌క్యాస్ట్ షెల్ఫ్‌ల నుంచి కూడా ప్రయోజనం పొందవచ్చు.
ఇది చదవండి: జియో IPL సీజన్ బంపర్ ఆఫర్ 25GB డేటా కేవలం…!
యూట్యూబ్ మ్యూజిక్(YouTube Music) లోని పాడ్‌క్యాస్ట్‌లు ఆన్-డిమాండ్, ఆఫ్‌లైన్, బ్యాక్‌గ్రౌండ్ లిజనింగ్ కోసం కూడా అందుబాటులో ఉంటాయి. అంటే పాడ్‌కాస్టర్‌లు ప్లాట్‌ఫారమ్‌లోని ప్రకటనలు, సభ్యత్వాల నుంచి మరింత సంపాదించుకోవచ్చు. ఈ ఫీచర్ యూట్యూబ్ సృష్టికర్తలకు వారి కంటెంట్ నుంచి డబ్బు సంపాదించడానికి, వారి అభిమానులతో కనెక్ట్ కావడానికి ఇతర మార్గాలను సులభం చేయనుంది. వాటిలో ఒకటి అభిమానుల ఫండింగ్, ఇది లైవ్ స్ట్రీమ్‌ల సమయంలో ఛానెల్ మెంబర్‌షిప్‌లు లేదా సూపర్ చాట్ ద్వారా వారి అభిమానులకు ప్రత్యేకమైన కంటెంట్ , ప్రయోజనాలను అందించడానికి సృష్టికర్తలను ఉపయోగపడుతుంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి