ఉమ్మడి చిత్తూరు జిల్లా(Chittoor Crime), ఆటో యాక్సిడెంట్…
ఉమ్మడి చిత్తూరు జిల్లా, మదనపల్లి మండలం, వలసపల్లి గ్రామం లోని అరవవాండ్లపల్లికి చెందిన పూల పెద్ద రెడ్డప్ప కుమారుడు పి. లక్ష్మీ నరసింహులు (35), అదే ఊరికి చెందిన భాస్కర్(35), సోమల మండలం పెద్దఉప్పరపల్లి నుంచీ కూలి పనుల కోసం అరవ వాండ్ల పల్లెకు వచ్చిన రమణ(45)లు ముగ్గురు కలిసి పుంగనూరు వద్ద ఓ రైతుకు చింతకాయల కోయడానికి కూలికి వెళ్లారు. చీకటి పడగానే సాయంత్రం బైక్ లో ముగ్గురు అరవాండ్లపల్లికి వస్తుండగా, పుంగనూరు మండలం సుగాలిమిట్ట సమీపంలోని ఈడిగి పల్లి, అక్కింవారిపల్లి దగ్గర బైకులో ఇంటికి వస్తూన్న ముగ్గురిని ఓ ఆటో వేగంగా వచ్చి ఢీకొంది(Auto Accident).
ఈ ప్రమాదంలో కడుపులోకి ఆటోలోని ఇనుప రాడ్లు దూసుకుపోవడంతో పూల లక్ష్మీనరసింహులు అక్కడే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. భాస్కర్, రమణలు తీవ్రంగా గాయపడి ఆటోలు ఇరుక్కుపోయి ఉండడంతో స్థానికులు వారిని కష్టం మీద వెలికి తీశారు. క్షతగాత్రులను మదనపల్లి 108 లో స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసరంభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందిస్తుండగా లక్ష్మీనరసింహులు మృతి చెందాడు. భాస్కర్, రమణలు ఆస్పత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు పుంగనూరు పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉంది..
ఇది చదవండి: భారీ బైక్ ర్యాలీ..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి