ఈసీ ఆదేశాలతో ఏపీలో ఐదుగురు IPS, IG లపై వేటు…
ఎన్నికల (Election) ముందు జగన్‍కు భారీ షాక్ తగిలింది. ఈసీ ఆదేశాలతో ఏపీలో ఐదుగురు IPS, IG లపై వేటు విధించారు.
గుంటూరు రేంజ్ IG పాలరాజును బదిలీ చేసారు. ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ పై బదిలీ, వేటు విధించడం జరిగింది. బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని వారికీ ఆదేశాలు జారీ చేసారు. సాయంత్రం 5 గంటల్లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని ఆదేశం పంపించారు. కాసేపట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది.
ఇది చదవండి : ఫోన్ ట్యాంపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్నకు రిమాండ్..!
Follow us on : Google News మరిన్నితాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి