రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం(Earthquake) ..
తైవాన్(Taiwan)లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర తీర ప్రాంతంలో 15 నిమిషాల పాటు వరుసగా భూమి కంపించింది. భూకంప ధాటికిపలు భవనాలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపోయాయి. రిక్టర్ స్కేలు(Richter scale)పై భూకంప తీవ్రత 7.2గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం హువాలిన్ నగరానికి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. హువాలిన్‌లో భవనాల పునాదులు కదిలాయి.
ఇది చదవండి: షెబాజ్ షరీఫ్‌కి తొలిసారి లేఖ రాసిన అమెరికా అధ్యక్షుడు..!
రాజధాని తైపీలో కూడా భూకంపం సంభవించింది. 1999 తర్వాత తైవాన్‌లో ఇంతటి భారీ భూకంపం సంభవించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. మరోవైపు భూకంపం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలల ఉధృతి పెరిగింది. దీంతో జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి