Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home International షెబాజ్ షరీఫ్‌కి తొలిసారి లేఖ రాసిన అమెరికా అధ్యక్షుడు..!

షెబాజ్ షరీఫ్‌కి తొలిసారి లేఖ రాసిన అమెరికా అధ్యక్షుడు..!

by Satya
The President of America wrote a letter to Shebaz Sharif for the first time

ప్రపంచ, ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించేందుకు నిరంతర మద్దతి స్తామని హామీ..

పాకిస్థాన్(Pakistan) నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్‌(Shebaz Sharif)కు అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) లేఖ రాశారు. ప్రపంచ, ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించే విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా నిరంతర మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ శాంతి, భద్రతలకు ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలకమని అన్నారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం, భద్రత, ఆర్థిక వృద్ధి విషయంలో భాగస్వామ్యం కొనసాగుతుందని బైడెన్ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలతో పాటు ప్రపంచజనుల భద్రత కోసం ఇరు దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యం కీలకమని బైడెన్ అభిప్రాయపడ్డారు. మానవ హక్కుల పరిరక్షణ, అభివృద్ధిలో పాకిస్థాన్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని అన్నారు.

ఇది చదవండి: అమెరికాలో ఘోర ప్రమాదం..!

ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, ప్రజల మధ్య సన్నిహిత బంధాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు పాకిస్థాన్‌లోని యూఎస్ ఎంబీసీ లేఖలోని విషయాలను వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడి హోదాలో పాక్ ప్రధానితో బైడెన్ జరిపిన తొలి అధికారిక సంభాషణ ఇదే కావడం గమనార్హం. 2021 జనవరిలో అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టాక పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. ఇక 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఇమ్రాన్ ఖాన్ స్థానంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నవాజ్ షరీఫ్‌తోనూ బైడెన్ మాట్లాడకపోవడం గమనార్హం.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే …
డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా కీలక పోస్ట్‌.
కెనడాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా …
కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.
కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: