86
రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. సోనియా గాంధీతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణస్వీకారం చేయించారు. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురా లిగా బాధ్యతలు చేపట్టడం ఇతే తొలిసారి. ఇప్పటి వరకు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా… తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. నిన్నటితో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ నుంచి సోనియా పోటీ చేశారు. సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12 మంది ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ,ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.