Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి (Chinthala Damodar reddy) మాట్లాడుతూ.. నెలరోజుల క్రితం నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికార పార్టీ వైస్ ఛైర్మెన్ చెన్నగోని అంజయ్య కోఆపరేటివ్ అధికారులకు ఫిర్యాదు చేయగా ఎటువంటి విచారణ జరపకుండా తనను సస్పెండ్ చేశారని దీనిపై బిఆర్ఎస్ చైర్మన్ కోఆపరేట్ ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళగా వారు నాపై నిరాధార ఆరోపణలు చేశారని వారు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ తిరిగి సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయ్యానని తెలిపారు.
ఇది చదవండి: జగనన్నకు మద్దతుగా కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్
జిల్లా మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, అవిశ్వాసం పెట్టాలంటే సుమారు ఏడుగురు డైరెక్టర్ల అభియోగాలు ఉండాలని కేవలం ఒకే ఒక్క కాంగ్రెస్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో నన్ను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. తాను చైర్మన్ గా ఎన్నికైన నాలుగు సంవత్సరాలలో పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా రైతులకు సేవలు అందించాను, ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్న 13 మంది డైరెక్టర్లతో జనరల్ బాడీ సమావేశం చేసిన తర్వాతే చేసే వాడిని, నాపై తప్పుడు అభియోగాలు పెట్టి రాజకీయాల లబ్ధి పొందాలనుకున్నారు. వారికి కోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిదని, తిరిగి నిన్న సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయ్యానని తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.