Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Andhra Pradesh జగనన్నకు మద్దతుగా కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్

జగనన్నకు మద్దతుగా కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్

by Satya
Jogi Ramesh

కృష్ణా జిల్లా(Krishna District) పెనమలూరు(Penamaluru)లో జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం అనే కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ నేషనల్ సర్వేలు అన్నీ అత్యధిక మెజారిటీతో వైసీపీ గెలుస్తుందన్నారు. రాష్ట్రంలో సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయని ఇప్పుడు చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)కి నీరాజనాలు పలుకుతున్నట్లు తెలిపారు.

ఇది చదవండి: పవిత్ర రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు కు అవమానం…..

రోజురోజుకీ తెలుగుదేశం పార్టీ దిగజారి పోతుందని కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తాడా అనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ కు 21 స్థానాల్లో అభ్యర్థులు లేక టీడీపీ అభ్యర్థులే జనసేన తరపున పోటీ చేసే పరిస్థితి ఏర్పడింది అని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంచి చేశాను కాబట్టి తనకు ఓటేయాలన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: