రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు(Nara Chandrababu) నాయుడు నిడదవోలులో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్(Ramadan) ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం మతపెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని, రంజాన్ తోఫా ఇచ్చింది కూడా టీడీపీనే అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం యూనివర్సీటీలు పెట్టింది కూడా టీడీపీ అని.. ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చేసింది ఏమిటని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.