Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాకినాడ (Kakinada) రూరల్ నియోజకవర్గం లో వైసిపి (YCP) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ దినవహి పెరుబాబు, మాజి డి.సి.ఎం.ఎస్ చైర్మన్ మనేపల్లి బాబ్జీ వారి అనుచరులతో అధికార వైసిపి కి రాజీనామా చేసి జన సేన పార్టీ లో చేరారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గంగరాజు నగర్ రోడ్డు నంబర్ 1 జానసేన రూరల్ కార్యాలయం లో రూరల్ శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు బ్రాహ్మణులపై చేస్తున్న దాడులను ఖండిస్తూ అధికార పార్టీ నుండి జనసేన పార్టీ లో చేరారని, ప్రభుత్వం బ్రాహ్మణుల పట్ల చూపిస్తున్న వైఖరికి నిరసనగా బ్రాహ్మణులు అందరు ఒకే తాటిపై కి వస్తున్నారన్నారు.
ఇది చదవండి: లిక్కర్ స్కాం లో అయ్యన్నపాత్రుడే ప్రధాన సూత్రధారి
అనంతరం మనేపల్లి బాబ్జీ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ లో కొనసాగి అనంతరం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైసిపి ఆవిర్భావం నుండి వైసిపి లో కొనసాగాననని 2019 లో పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత 2023 లో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా పార్టీ నియమించిందని, కానీ పెద బ్రాహ్మణులకు కార్పొరేషన్ ద్వారా ఎటువంటి సహాయసహకారాలు చేయలేని నిస్సహాయ స్థితి లో పార్టీ ఉంచిందని, రాష్ట్రం లో రోజు రోజుకు బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులకు మనస్తాపంతో పార్టీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జన సేన పార్టీ లో చేరమని, కూటమి విజయానికి రూరల్ నియోజకవర్గం లో పంతం నానాజీ విజయానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ కో కో ఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్, జన సేన నాయకులు పుల్ల శ్రీరాములు, చైర్మన్ శ్రీను, సర్పవరం గ్రామ కమిటీ అద్యక్షులు వీరబాబు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.