AP Elections 2024: ఎన్నికల ఫిర్యాదుల కొరకు ప్రత్యేక ఫోన్ నంబర్ -9440796184…
పల్నాడు జిల్లా ఎస్పీ,
ప్రజలు స్వేచ్చగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే మా ప్రధాన ధ్యేయం – ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సార్వత్రిక ఎన్నికలు – 2024(AP Elections 2024) దృష్ట్యా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఏదైనా అనుకొని సంఘటన జరిగినప్పుడు, దానిని వెంటనే పరిష్కరించే దిశగా పల్నాడు జిల్లా పోలీస్ విభాగం అడుగులు వేస్తుందని ఎస్పీ గారు తెలిపారు. దానిలో భాగంగానే ప్రజల నుండి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు అందుకోవడానికి వీలుగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఒక ఫోన్ నంబర్ – 9440796184 కేటాయించడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. ఎవరైనా/ ఏదైనా రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్ కమిషన్ వారు జారీ చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించినా వెంటనే పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఎన్నికల ఫిర్యాదుల కొరకు ప్రత్యేక ఫోన్ నంబర్…