బీజేపీ(BJP) పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) మేనిఫెస్టో(Manifesto)ను విడుదల చేశారు. ఢిల్లీ(Delhi)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపర్చారు. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు, చిరు వ్యాపారులకు మోడీ మేనిఫెస్టోను అందించారు. ఈ మేనిఫెస్టోను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులు ప్రత్యేకంగా రూపొందించారు. దాదాపు 15 లక్షల మంది అభిప్రాయాలను సేకరించారు. అంబేద్కర్ జయంతి రోజున ‘సంకల్ప్ పత్ర’ విడుదల చేయడం సంతోషంగా ఉందని బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డా అన్నారు.
ఇది చదవండి: ఫోన్ ట్యాపింగ్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు..
సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. అంబేద్కర్ సూచించిన మార్గంలో తాము కూడా నడుస్తున్నామని అన్నారు. ఆయన ఆకాంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2014లో మోడీ ప్రధాని కాగానే పేదల కోసమే బీజేపీ సర్కార్ అని చెప్పారు.. ఆ దిశగా అడుగులు వేశారన్నారు. ఇప్పుడు కూడా రాబోయే ఐదేళ్లు ఏం చేస్తామో, చేయబోతున్నామో తమ మేనిఫెస్టో చెబుతుందన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తేనే ప్రగతి సాధ్యమని తాము విశ్వసిస్తున్నట్టు వెల్లడించారు. మోడీ నాయకత్వంలో పదేళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని నడ్డా తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.