Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Latest News ఫోన్ ట్యాపింగ్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు..

ఫోన్ ట్యాపింగ్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు..

by Prakash
Phone Tapping


ఫోన్‌ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో అనేక సంచలన విషయాలు..

ఫోన్‌ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ఏ 4 గా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నలుగురు కీలక పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా రాధా కిషన్ వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. తన చిన్ననాటి మిత్రుడు అయిన ఎమ్మెల్సీకి పూర్తిస్థాయిలో రాధా కిషన్ సహాయం చేసినట్లు విచారణలో తేలింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

పోలీస్ వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బుల పంపిణీ…

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డబ్బులను రవాణా చేసిన రాధా కిషన్… పోలీస్ వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బులను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను ఎమ్మెల్సీకి అందజేసినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ జోన్‌ టాస్క్‌ఫోర్స్ ఎస్సైని ఉపయోగించి డబ్బులను రవాణా చేసినట్లు గుర్తించారు. ఎమ్మెల్సీ డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి డెలివరీ చేయించారని.. డబ్బుల వ్యవహారం బయట పడకుండా ఉండేందుకు కొత్త సిమ్ కార్డు ఐఫోన్ కొని ఎస్ఐకి ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

డబ్బుల రవాణాలో రిటైర్డ్ పోలీస్ అధికారి కీలక పాత్ర..

బొలెరో వాహనంలో ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని మరీ ఎమ్మెల్సీకి రాధా కిషన్ టీం అందజేసింది. డబ్బుల రవాణాలో రిటైర్డ్ పోలీస్ అధికారి కీలక పాత్ర పోషించాడు. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్‌కు రాధా కిషన్ చేరవేశారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురు రాజకీయ నేతలు కుటుంబ సభ్యులపై కూడా సదరు అధికారి నిఘా పెట్టారు. ప్రణీతరావు ఇచ్చే సమాచారంతో నిఘాను కట్టేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. రాధా కిషన్‌కు సహకరించిన ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లతో మాజీ పోలీసు అధికారులను సిట్ అధికారులు విచారించనున్నారు.

ఇది చదవండి : పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఫోన్ ట్యాపింగ్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు..
Advertisements

You may also like

Our Visitor

008571
Total views : 56861

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.