పదవీ వ్యామోహంతో సొంత బాబాయ్ ని చంపిన వ్యక్తికి ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం కట్టబెట్టకూడదని పిలుపు నిచ్చారు ఏలూరు పార్లమెంట్ టీడీపీ కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్(Putta Mahesh Kumar Yadav). ఉంగుటూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ సొంత చెల్లెళ్ళకే అన్యాయం చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని, ఈ విషయం ఇద్దరి చెల్లెల్లు మీటింగ్ పెట్టి మరీ చెబుతున్నారని, జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ఈ 5 సంవత్సరాల పాలనలో దోచుకోవడం తప్పితే అభివృద్ధి ఎక్కడా జరగలేదని , దోచుకున్న డబ్బుతో మరొకసారి మీ అమూల్యమైన ఓటును ధనమదంతో కొనడానికి వస్తున్నారని మరొక్కసారి ఎవ్వరూ మోసపోవద్దని అన్నారు. తాను గెలిచిన తర్వాత ఏలూరు పార్లమెంటు లో తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకువస్తానన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్థామని, రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: చంద్రబాబు, పవన్ లు కలిసి చేసిన దాడి ఇది- ఎమ్మెల్యే భూమన కరుణాకర్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.