చంద్రబాబు(Chandrababu) ఫ్యాక్షన్ రాజకీయాల(Factional politics)కు మా నాయకుడు జగన్ భయపడడంటూ ఫైరయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్(Minister Gudivada Amarnath). విజయవాడ(Vijayawada)లో మేమంతా సిద్ధం(Memanthaa Siddham) రోడ్ షో లో జగన్ పై జరిగిన దాడి(Attack on Jagan)ని ఆయన ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ దాడిని తీవ్రంగా భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా ఇటువంటి పాతకాలపు ఫ్యాక్షన్ రాజకీయ దాడులు చేస్తే జగన్ భయపడతారనుకుంటే అది అమాయకత్వమన్నారు.
ఇది చదవండి: చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు…
గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగా హత్యకు కారణమైనటువంటి టీడీపీ, ఇప్పుడు సీఎం జగన్ పై దాడి చేస్తే జగన్ వెనకడుగు వేస్తాడనో, రోడ్ షో ఆపేస్తారనో, సమావేశాలు రద్దు చేస్తారనో అనుకుంటే అది మూర్ఖత్వమవుతుందన్నారు. గత 15 రోజులుగా సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రోడ్ షో కి వస్తున్న స్పందన చూసి టీడీపీ ఓర్వలేక, చంద్రబాబు కూటమికి జనం రావటంలేదని, మళ్లి ఒడిపోతున్నానే భయంతో బాబు ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. ఈ చర్య సమంజసమైనది కాదు.. ప్రజలు, ప్రజాస్వామ్యం అన్నిటి కంటే గొప్పది, 2024 మే13న జరగబోయే ఎన్నికల్లో 2019 ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.