కాకినాడ లో ఎన్నికల నామినేషన్లు (Election Nominations):
కాకినాడ రూరల్ నియోజకవర్గం లో ఎన్నికల నామినేషన్ల (Election Nominations) పర్వం మొదలు అయింది. ఈ నెల 18 నుండి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మొదటి రోజు వైసిపి పార్టీ నుండి సస్పెండ్ కు గురైన డాక్టర్ పితాని అన్నవరం నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన అర్. ఓ కార్యాలయం లో డాక్టర్ పితాని అన్నవరం , బిసి నాయకులు భీమా రాజు మరికొంత మంది బిసి నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం డాక్టర్ పితాని అన్నవరం మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం లో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశానని, గత 20 సంవత్సరాలుగా రమ్య హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పెద వారికి వైద్య సహాయం అందిస్తూ, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తున్నామని, 2019 ఎన్నికల్లో మండపేట నుండి పోటీ చేయమని జగన్ ఆదేశించి చివరి నిముషంలో సీటు కేటాయించలేదని, ఈ ఎన్నికల్లో సీటు ఇస్తారు అనుకునన్నాని కానీ జగన్ మోహన్ రెడ్డి కి ఉన్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇవ్వలేదన్నారు. అందుకే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి రూరల్ లో విజయకేతనం ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటం
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి