ఎన్నికల(Election)కు మరో 19 రోజులే సమయం ఉందని, మన జీవితాలను మార్చుకునే తేదీ మే 13 అని చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) పాతపట్నంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ(Prajagalam Sabha) నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ… పాతపట్నం ప్రజలు కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారని కొనియాడారు. ఈ సభకు విశేషంగా తరలివచ్చిన ప్రజలను, వారిలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.
ఇది చదవండి: అట్టహాసంగా విరుపాక్షి నామినేషన్…
ఫైర్ బ్రాండ్, తండ్రి ఎర్రన్నాయుడికి తగ్గ తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడును వరుసగా మూడోసారి కూడా పార్లమెంటుకు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక సామాన్య వ్యక్తి గోవిందరావుకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. పేర్కొన్నారు. ఈ ఎన్నికలు తన కోసం కాదని, లేకపోతే తమ కూటమి పార్టీల కోసం కాదని… ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని ఉద్ఘాటించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి