బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) బస్సు యాత్ర(Bus Yatra)కు సర్వం సిద్ధం చేశారు. రేపటి నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర కొనసాగనున్నది. 17 రోజుల పాటు 12 లోక్ సబ స్థానాల్లో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ యాత్ర కొనసాగించనున్న బస్సుకు తెలంగాణ భవన్ లో గులాబీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉండే విదంగా బస్సు యాత్రకు ప్లాన్ చేశారు.
ఇది చదవండి: అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు..!
రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి బయల్దేరి మిర్యాలగూడ చేరుకొని.. అక్కడి నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. మే 10వ తేదీన సిద్ధిపేటలో బస్సు యాత్ర ముగియనున్నది. బస్సు యాత్రలో రైతుల అంశం ప్రధాన అజెండాగా ఉండబోతుంది. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు సాగు నీరు, రైతులకు రైతు బంధు, పంటలకు బోన్ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ అడిగి తెలుసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా చేసుకోబోతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి