Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Telangana అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు..!

అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు..!

by Satya
Farmers are losing due to untimely rains

మెదక్ జిల్లా(Medak District)లో అకాల వర్షంతో రైతులు(Farmers) నష్టపోతున్నారు. మరో వైపు వానరాల బెడదతో రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆరుగాలం కష్టపడిన పంట కళ్ళముందే వర్షార్పణం కావడంతో కన్నీరు, మున్నీరు అవుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట నార్సింగి, నిజాంపేట మండలాల్లో కొన్ని గ్రామాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇది చదవండి: గొలుసు దొంగ ను వెంటాడి పట్టుకున్న స్థానికులు

వర్షానికి ధాన్యం తడవకుండా ఉండడానికి అవసరమైన కవర్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని మార్కెట్ కేంద్రంలో రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. మరోవైపు కోతుల బెడద తీవ్రంగా ఉంది. ధాన్యం కుప్పలపై ఎగబడి కోతులు ధాన్యాన్ని పాడు చేస్తున్నాయి. ఓవైపు కోతులు, మరోవైపు అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • హైడ్రాపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.
    తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ధిక్కరిస్తూ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం…
  • రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం…
  • కరీంనగర్‌ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన.
    కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అంశాలపై స్పందించారు. సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ యాజమాన్యం బలవంతంగా “కల్మా, సూరహ్ ఫతే” చదవాలని ఆదేశించడం దుర్మార్గమని ఆరోపించారు. ఇది హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై దాడిగా అభివర్ణిస్తూ దీనిని…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

040928
Total views : 212409

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: