మత్తుకు దూరంగా ఉండండి – భవిష్యత్తును కాపాడుకోండి…అనే నినాదంతో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు, తనిఖీలను నిర్వహిస్తోంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం, .సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తోంది పోలీస్ శాఖ. ఏర్పేడు మండలం కాట్రాకాయలకుంటలోని రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్‌లో పరిశ్రమ కార్మికులకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు . డ్రగ్స్ ఫ్రీ శ్రీ సిటీ లక్ష్యంతో పారిశ్రామిక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘా ఉంచి, గంజాయి వినియోగదారులను గుర్తించే చర్యలు చేపట్టారు. అధునాతన సాంకేతికత – సరికొత్త బయో-చెక్ టెస్టింగ్ కిట్లను ఉపయోగిస్తున్నారు. ఈ కిట్ల ద్వారా అనుమానితులకు తక్షణమే గంజాయి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మత్తు వల్ల కలిగే శారీరక, మానసిక, మరియు కుటుంబ పరమైన అనర్థాలను వివరిస్తూ వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే, బాధితులకు పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
తిరుపతి పోలీసుల అవగాహన కార్యక్రమాలు.
16
previous post





Total views : 212440