Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Latest News పార్లమెంట్ సమావేశాల బిజినెస్ లిస్ట్ విడుదల.

పార్లమెంట్ సమావేశాల బిజినెస్ లిస్ట్ విడుదల.

by CVR NEWS
పార్లమెంట్ సమావేశాల బిజినెస్ లిస్ట్ విడుదల

పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన బిజినెస్ లిస్ట్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం ఈ విడత సమావేశాల్లో ఐదు కీలకమైన కొత్త బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. దేశంలో న్యాయ, ఆర్థిక, విద్యా రంగాలతో పాటు చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా పలు చట్ట సవరణలను ప్రభుత్వం ఈ ఎజెండాలో చేర్చింది.దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసుల భారాన్ని తగ్గించేందుకు వీలుగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును కేంద్రం సభ ముందుకు తీసుకురానుంది. దేశ పన్నుల వ్యవస్థను మరింత సరళీకరిస్తూ, ఆదాయపు పన్ను చట్టంలో కీలక సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేలా ‘విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు’పై ఈ సమావేశాల్లో సమగ్ర చర్చ జరగనుంది. ప్రస్తుతం ఉభయ సభల సంయుక్త కమిటీ పరిశీలనలో ఉన్న ‘వికసిత్ భారత్ శిక్ష అధిష్టానం బిల్లు’పై ఈ విడతలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడంపై ప్రత్యేక చర్చ జరగనుంది. ముఖ్యంగా ఈ రంగంలో ఎదురవుతున్న ఆలస్యపు చెల్లింపుల సమస్యల పరిష్కారానికి నూతన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అలాగే రాష్ట్రాలు ‘ఎంఎస్ఎఫ్ ఫెసిలిటేషన్ కౌన్సిల్స్’ ఏర్పాటు చేసుకునేలా చట్ట సవరణ చేయనున్నారు. వీటితో పాటు, 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అదనపు నిధుల వ్యయంపైన లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించనున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040943
Total views : 212467

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: