తెలంగాణ(Telangana)లో లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంది బీజేపీ(BJP). ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట పట్టనున్నారు. తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణ పర్యటనకు రానున్నారు. నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు అమిత్ షా. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్ధిపేటకు వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2 గంటల తర్వాత తిరిగి భువనేశ్వర్ వెళ్లనున్నారు అమిత్ షా.
ఇది చదవండి: ఇంటర్ ఫలితాలలో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం…
ఈ బహిరంగ సభకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్చార్జి అభయ్ పాటిల్, మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు పలువురు నేతలు హజరవుతారు. అమిత్ షా సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమిత్‌షా రాకతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత… అమిత్ షా తొలిసారి తెలంగాణ పర్యటనకు రానుండటంతో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. సభా ప్రాంగణాన్ని భారీ కటౌట్లతో నింపనున్నారు. అలాగే పెద్ద ఎత్తున జనసమీకరణకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి