ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్(Jagan) గుంటూరు జిల్లా(Guntur District)లో ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహించారు. చంద్రబాబు(Chandrababu) తనను ఒక బచ్చా అంటున్నాడని, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని అన్నారు. నేను బచ్చా అయితే… నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు? నేను బచ్చా అయితే… నన్ను ఎదుర్కొనేందుకు ఎందుకు పొత్తులు పెట్టుకున్నాడు? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఎన్నికలకు ఒంటరిగా వచ్చి ధైర్యంగా పోరాడుతున్నాను అని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు అంత పుడింగి అయితే పొత్తులు లేకుండా సింగిల్ గా రావొచ్చు కదా అని సవాల్ విసిరారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో కూడా చెప్పుకోలేకపోతున్నాడని, చంద్రబాబు అంటే గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని సీఎం జగన్ విమర్శించారు. మా ప్రభుత్వంలో అమ్మ ఒడి, పెన్షన్లు, ఆసరా, చేయూత, వాహనమిత్ర వంటి పథకాలు తెచ్చామని …. అలాంటివి చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదని జగన్ విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.