ఓ పక్క ఎన్నికలు, మరో పక్క సమ్మర్ హాలిడేస్… ఇంకేముంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు అమాంతంగా చార్జీలు పెంచేశారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీనితో విమాన చార్జీల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. బస్సు చార్జీలు కూడా విమాన చార్జీలకు పోటీ పడటంతో విమాన సర్వీసుల టికెట్ ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. దండుకునేందుకు భారీగా ధరలు పెంచాయి. దీనితో విమాన చార్జీలు చుక్కలను అంటుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి సాధారణంగా రోజుకు సగటున 50వేల మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం వారి సంఖ్య దాదాపు 60 వేలకు పెరిగింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇంకేముంది. దండుకునేందుకు విమానయాన సంస్థలు భారీగా ధరలు పెంచాయి. కొద్దిరోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో కొడైకెనాల్, కొచ్చి, ఊటీ, కేరళ, జైపుర్, ఢిల్లీ, అయోధ్య, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, మలేసియా తదితర ప్రాంతాలకు రద్దీ పెరిగింది. ఎన్నికల దృష్ట్యా ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు నేతల రాకపోకలు పెరిగాయి. ఫలితంగా పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఛార్జీలు పెంచాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో సగటున టికెట్ ధర 4వేల 500 రూపాయలు ఉంటుంది. ఎన్నికలకు ముందు రోజు 12వ తేదీకి దాదాపు 50 శాతం పెరిగి 6వేల 500 రూపాయలకు చేరింది. అదే రోజున ఢిల్లీకి 6వేలుగా ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కొచ్చికి 5 వేల వరకు ఛార్జీ ఉంటుంది. ఈ నెల 12న 7 వేల రూపాయల వరకూ ఉంది. ఆఖరి నిమిషంలో రద్దీని బట్టి ఛార్జీల్లో మార్పులు ఉంటాయని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.