గోల్కొండ బోనాలతో హైదరాబాద్‌లో బోనాల పండుగకు నాందిపడింది. గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. నేడు సమర్పించే తొలి బోనానికి దాదాపు లక్షమంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. తెల్లవారుజామున 5.30 గంటలకు రెండు పచ్చికుండలతో వచ్చిన కులవృత్తుల నాయకుడు శంకర్ అమ్మవారికి బోనం సమర్పించారు. గోల్కొండలోని ఫతేదర్వాజాలో ఉన్న పూజారి సర్వేశ్‌కుమార్ ఇంట్లో నుంచి జగదాంబికా అమ్మవారి ఉత్సవమూర్తులను మధ్యాహ్నం ఊరేగింపుగా తీసుకెళ్తారు.
గోల్కొండ ఆలయ అమ్మవారి కులవృత్తుల సంఘం నాయకుడు బొమ్మల సాయిబాబాచారి నివాసం నుంచిమహంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులను వైభవంగా ఊరేగిస్తారు. వందమంది పోతురాజులతో ఐరావతంపై ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు. అలాగే, సాయిబాబాచారి నివాసం వద్ద 1000 మందికి అన్నదానం నిర్వహించనున్నారు. బోనాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో 600 మందితో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. వేడుకల్లో డీజేకు అనుమతి లేదని, కావాలంటే సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. అలాగే, 150 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. లంగర్‌హౌస్ చౌరస్తాలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌తోపాటు అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి