సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు తెల్లవారుజామున ధూమ్ దాంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. అలాగే పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అన్ని శాఖల సహకారంతో బోనాలకు ఏర్పాట్లు చేశారు. ఉజ్జయని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న CM రేవంత్ రెడ్డి . సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసారు అధికారులు. అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాట చేసారు. అలాగే వీఐపీలకు ఒకటి సాధారణ భక్తులకు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తుల రాకపోకలకు ఆర్టీసీ 175 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు, రేపు సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయానికి రెండు కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కుప్పం ఎయిర్పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..కుప్పం విమానాశ్రయ భూసేకరణకు మార్గం సుగమమైంది. 150 ఎకరాల సేకరణ నోటిఫికేషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తెలిపింది. భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై పలువురు సుప్రీం కోర్టులో…
- 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..ఇక్కడ బాలికది సాధారణమైన గర్భంకాదు.. అత్యాచారం చేయబడి గర్భం దాల్చింది. తన గర్భంలో పెరుగుతున్నదీ..పెంచుతున్నదీ నిందితుడి ప్రతిరూపం..గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తే..తల్లీ బిడ్డల ప్రాణాలకు హాని జరుగొచ్చు..లేదా తల్లి క్షేమంగా ఉన్నా…బిడ్డ చనిపోతే…భ్రూణ హత్య ..అదీ సరికాదు…సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైనా సరే..…
- బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని స్పష్టం చేశారు. ‘మా-మాటి-మానుష్’ స్ఫూర్తితో టీఎంసీ ప్రభుత్వాన్ని తిరిగి…
- కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..బ్రహ్మంగారిమఠం వివాదం మళ్ళీ మొదలైంది. తాత్కాలిక పీఠాధిపతిగా నియామకమైన వెంకటాద్రి స్వామి పూర్వపు పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మారుతి మహాలక్ష్మి నివాసం ఉంటున్న గృహానికి గుర్తుతెలియని వ్యక్తులు…
- తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించడం పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయనుంది. హైదరాబాద్లో జన్మించిన ఆనంద్ చిన్నప్పటి నుంచే ప్రతిభను చాటుకుని విద్యలో అగ్రగామిగా నిలిచారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువు కున్న సి వి ఆనంద్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 61692