Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Telangana ఉజ్జయని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న CM రేవంత్ రెడ్డి

ఉజ్జయని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న CM రేవంత్ రెడ్డి

by Rama
ఉజ్జయని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న CM రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు తెల్లవారుజామున ధూమ్ దాంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. అలాగే పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అన్ని శాఖల సహకారంతో బోనాలకు ఏర్పాట్లు చేశారు. ఉజ్జయని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న CM రేవంత్ రెడ్డి . సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసారు అధికారులు. అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాట చేసారు. అలాగే వీఐపీలకు ఒకటి సాధారణ భక్తులకు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తుల రాకపోకలకు ఆర్టీసీ 175 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు, రేపు సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయానికి రెండు కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..
    మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
  • ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
  • పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..
    కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
  • మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…
    పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
  • అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…
    అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

009385
Total views : 62199

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.