Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Latest News నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

by Rama
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఈ రోజు రాత్రి లేదా రేపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ అమలును సీఎం రేవంత్ ప్రారంభించారు. దీనిని పురస్కరించుకుని వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీని రేవంత్ ఆహ్వానించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్.. ఇతర కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైనా సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కోరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది..
    సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని…
  • పూణేలో కూలిన శిక్షణ విమానం..
    మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి. రెడ్‌బర్డ్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
  • సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…
    కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
  • విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..
    తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…
  • Gujarat Titans ఘన విజయం.. Sunrisers Hyderabad 86 పరుగులకే కుప్పకూలింది..
    Sunrisers Hyderabad 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఘోరమైన బ్యాటింగ్ పతనాన్ని ఎదుర్కొంది. చివరకు 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభమే విపత్తుగా మారింది. Mohammed Siraj వేసిన తొలి ఓవర్లోనే Travis…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

012370
Total views : 74845

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.