వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తులకు సంబంధించిన వాన్‌పిక్ కేసు నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. జగన్ కంపెనీల్లో రూ. 850 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పటి ప్రభుత్వం నుంచి నిమ్మగడ్డ అనేక రాయితీలు పొందారని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. క్విడ్ ప్రొ కోలో ఇదంతా భాగమని ఆరోపించింది. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ 2021లో హైకోర్టులో నిమ్మగడ్డ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం.. జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ పెట్టుబడులు క్విడ్ ప్రొ కోలో భాగమా? కాదా? దీనిని లంచంగా భావించాలా? అన్న అంశాలు విచారణలో తేలాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
దురుద్దేశంతోనే క్రిమినల్ కేసు పెట్టారన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది. అలాగే, కేసు పెట్టడానికి తగిన ఆధారాలు, కారణాలు లేవన్న పిటిషనర్ వాదనను కూడా తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. కంపెనీ చేసిన తప్పులకు తాను బాధ్యుడిని కానని చైర్మన్ తప్పించుకోలేరని, కాబట్టి ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి