కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పట్నానికి రానున్నారు . ఈ నెల 29న విశాఖకు రానున్న మోదీ. ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 3. 40 గంటల విశాఖ INS డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆంధ్రా యూనివర్శిటీ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు. ఏయూ సభా వేదిక నుంచే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తోపాటు పలువురు కూటమి మంత్రులు పాల్గొంటారు.
సుమారు 85వేల కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్ట్ ద్వారా 25వేల మందికి ఉపాధి లభించడంతో పాటు విశాఖ ప్రతిష్ఠ మరింత పెరగనుంది. విశాఖను గ్రోత్ హబ్‌గా ప్రకటించిన కేంద్రం.. దానికి సంబంధించి కార్యాచరణ చేపట్టింది. మరోవైపు.. ఏపీ ప్రజలను పదేళ్లుగా ఊరిస్తున్న రైల్వే జోన్‌కు , పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి