రామచంద్రపురంలో 40 ఏళ్ల నాటి కబేళా ..

Advertisements

<p>డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న పశు కబేళా స్థానిక ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది&period; ప్రధాన రహదారి పక్కనే నిబంధనలకు విరుద్ధంగా కబేళా నిర్వహణ కొనసాగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి&period; పశువులను యథేచ్ఛగా వధించడం&comma; వాటి వ్యర్థాలను అక్కడికక్కడే పడవేయడం వల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోంది&period; ఈ దుర్గంధం కారణంగా రహదారిపై వెళ్లే ప్రయాణికులు మాత్రమే కాకుండా సమీప ప్రాంత ప్రజలు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు&period; ఎండాకాలం&comma; వర్షాకాలం అనే తేడా లేకుండా ఎప్పుడూ దుర్వాసన వ్యాపిస్తోందని ప్రజలు వాపోతున్నారు&period; పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది&period; ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>రామచంద్రపురం పట్టణ ముఖద్వారం వద్ద కాకినాడ ప్రధాన రహదారిపై ఉన్న ఈ కబేళా పరిశుభ్రత నిబంధనలను పూర్తిగా విస్మరించినట్లు ఆరోపణలు ఉన్నాయి&period; కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్&comma; పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ&comma; ఇలాంటి కీలక సమస్యలపై మాత్రం అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు&period; గతంలో కబేళాను సీజ్ చేసినప్పటికీ నిర్వాహకులు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది&period; ముఖ్యంగా రాత్రి వేళల్లో పశువులను వధించి వ్యర్థాలను అక్కడే పడవేయడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది&period; ఈ కారణంగా చుట్టుపక్కల నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది&period; వెంటనే కఠిన చర్యలు తీసుకుని కబేళా నిర్వహణను నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>కబేళా సమస్య ఒకవైపు జీవనోపాధి&comma; మరోవైపు ప్రజల ఆరోగ్యం అనే రెండు కీలక అంశాలకు సంబంధించినదిగా మారింది&period; కబేళాపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల ఉపాధిని కాపాడుతూ&comma; ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేలా సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు&period; ప్రధాన రహదారి పక్కన కాకుండా&comma; నివాస ప్రాంతాలకు దూరంగా కబేళాను తరలిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు భావిస్తున్నారు&period; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి తీసుకువెళ్లగా&comma; సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం&period; అయితే ఆ హామీ ఇంకా అమలు జరగలేదు &period;ఇప్పటికైనా అధికారులు&comma; ప్రజాప్రతినిధులు స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..