140
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామాంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. నల్లమోతుల రామారావు అనే వ్యక్తి ఉదయం వాకింగ్ కి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యి ఎలుగుబంటి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు అనంతరం పుర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.