నంద్యాల జిల్లాలో వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. నంద్యాల హౌసింగ్ బోర్డు కాలనీలో 50 సంవత్సరాల వృద్ధురాలు గ్లాడిన్ నివాసముంటోంది. ఎప్పటి మాదిరిగానే ఉదయం పనిమనిషి గ్లాడిన్ ఇంటికి వెళ్లి ఎంతసేపు పిలిచినా పలక పోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తలుపు పగులకొట్టి చూడగా, వృద్ధురాలు తలపై తీవ్రగాయాలతో చనిపోయి కనిపించింది. వెంటనే క్లూస్ టీం సాయంతో విచారణ చేపట్టారు. మృతురాలి ఇద్దరు కుమార్తెలకు వివాహమై హైదరాబాద్ లో ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా సంవత్సరం క్రితం వృద్ధురాలి భర్త మరణించారు. నిన్న రాత్రి 8 గంటల వరకు పనిమనిషి గ్లాడిన్ ఇంట్లోనే ఉన్నారు. మరి ఉదయం లోపు గ్లాడిన్ ను ఎవరు హత్యా చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
వృద్ధురాలి దారుణ హత్య
72