పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో కొత్తపేట, గీతాంజలి స్కూల్ పక్కన ఉన్న కాంప్లెక్స్‌లో ఒక షాపులో రవి కృష్ణమాచారి అనే వ్యక్తి కొంతకాలం నుండి నెట్ పాయింటును నిర్వహిస్తూ ఉన్నాడు. సెప్టెంబర్ మాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మ అనే పథకాన్ని ప్రవేశపెట్టి సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ భగవానుడి జయంతి రోజున ఈ పథకాన్ని అమలు చేస్తూ 1000 కోట్ల పైగా నిధులు విడుదల చేయడం జరిగింది. లోన్ వెంటనే రావాలంటే నాకు ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లిస్తే లోన్ త్వరగా వచ్చేటట్టు చేస్తానని ప్రజలకు ఆశ చూపి వాళ్ల దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డాడని, రవి కృష్ణమాచారి ప్రజలకు మాయమాటలు చెప్పి మీ అప్లికేషన్ త్వరగా రావాలి అంటే నేను మాట్లాడి మీకు లోను వచ్చే విధంగా చేస్తాను అని ఒక్కొక్క వ్యక్తి నుండి 1000 .2000. 5000 వరకు కూడా వసూలు చేయడం జరిగింది వీరిలో కొందరిని వ్యక్తిగత లోన్లు కూడా ఇప్పిస్తానని బ్యాంక్ అధికారులు తనకు బాగా తెలుసు అని మాయ చేసి. 50 వేల వరకు కూడా ఒక్కొక్క వ్యక్తి నుండి వసూలు చేసిన పరిస్థితి ఈ విధంగా లక్షలాది రూపాయలు పేద ప్రజల వద్ద నుండి వసూలు చేసుకుని వారి అప్లికేషన్లు అన్ని తన వద్దనే ఉంచుకొని నేను ఆన్లైన్ చేస్తానులే మీరు వెళ్ళండి సర్వర్ రావడం లేదు అంటూ వారాలు గడుస్తున్న ఈ రోజు రేపు అంటూ నెలల గడుపుతూ వచ్చాడు. డబ్బులు ఇచ్చినవారు గట్టిగా ఫోన్లు చేసి అడుగుతుండగా మీకెందుకు నేను చూసుకుంటా నేను మీ పని మీద ఉన్న అంటూ మాయ మాటలు చెప్పడం జరిగింది. తీరా ఆరా తీసేసరికి షాపు కాళీ చేశారు. ఇల్లు ఖాళీ చేసి ఊడయించి వెళ్ళిపోయాడని, తెలుసుకున్న తర్వాత బాధితులు అవాక్కవడం జరిగింది. బాధితుల పక్షాన సిపిఐ పార్టీ ఉలవలపూడి రాము మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయవలసిందిగా పట్టణ సిఐ దీనిపై విచారించి రవికృష్ణమాచారి పై కేసు నమోదు చేసి బాధితులను ఆదుకోవాలని ఇదేవిధంగా చాలామంది ఈజీ మనీకి అలవాటు పడి ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసు వారు ఇలాంటి వారి నుండి వినుకొండ పట్టణంలో వినుకొండ నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో పునరావతం కాకుండా చూడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
లోన్ ఇప్పిస్తానంటూ దోపిడీకి పాల్పడిన వ్యాపారి
82
previous post