జనగామ ఎమ్మెల్యే, భారాస సీనియర్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదైంది. పోచారం ఐటీ కారిడార్ ఠాణాలో ఆయనతోపాటు భార్య నీలిమ, మధుకర్‌రెడ్డిలపై మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని బుద్ధనగర్‌కు చెందిన ముచ్చర్ల రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులోని వివరాల మేరకు ఘట్కేసర్ మండలం చౌదరిగూడలో ఎంఏ రషీద్, ఎంఏ ఖాదర్ పేరిట సర్వే నంబరు 796లో ఉన్న భూమిలో 1984-85 ప్రాంతంలో వెంచర్ వేశారు. లేఅవుట్లోని 167 ఓపెన్ప్లాట్లను పలువురు కొనుగోలు చేశారు. 2020లో సదరు లేఅవుట్లోని 150 చదరపు గజాల ప్లాటును ఉటుకూరు మల్లేశం అనే వ్యక్తి నుంచి ముచ్చర్ల రాధిక కొనుగోలు చేశారు. కొంతకాలం క్రితం ఈ స్థలంలోకి గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నీలిమ, మధుకర్‌రెడ్డిలు దౌర్జన్యంగా ప్రవేశించి స్తంభాలు తొలగించడంతోపాటు నిర్మాణం కోసం తవ్విన గుంతల్ని పూడ్చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించడంతోపాటు మండల రెవెన్యూ కార్యాలయంలోని లేఅవుట్లో వివరాలను మార్చారని, తమ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి పై కేసు నమోదు..!
102
previous post