అధికారులతో సమావేశమై నేడు తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్

Revanth Reddy

Advertisements

&NewLine;<p>స్పష్టమైన మెజారిటీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనపై దృష్టిసారించింది&period; సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో వడివడిగా పాలనాపరమైన అడుగులేస్తోంది&period; ఈ క్రమంలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని జ్యోతిబా పూలే ప్రజాభవన్‌ నుంచి ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీకి మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం&period; తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ప్రజాభవన్ సీఎం క్యాంప్ కార్యాలయంగా కొనసాగుతోంది&period; అయితే ప్రస్తుతం అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తుండడంతో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను మరో చోటకు మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది&period; ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీలో గుట్ట మీద ఉన్న బ్లాక్‌‌‌‌లోకి మార్చాలని&comma; ఈ మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది&period; సోమవారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీ&comma; ప్రభుత్వ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి సీఎం క్యాంపు ఆఫీస్‌ తరలింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి&period; ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీని సందర్శించారు&period; ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు&period; సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి తరలిస్తే రేవంత్ రెడ్డి నివాసానికి చాలా దగ్గర అవనుంది&period; సీఎం నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ప్రాంతంలో ఉంది&period; ప్రస్తుతం అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు ఆయన వెళ్తున్నారు&period; ఒకవేళ ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీకి క్యాంప్ ఆఫీస్‌ను మార్చితే దూరం చాలా వరకు తగ్గనుంది&period; ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో అక్కడ తగిన వసతులు కూడా ఉన్నాయి&period; దీంతో అక్కడ ఏర్పాటు చేస్తే అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్