కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలవుతాయో లేదో కానీ.. 6 నెలలకు ఓ ముఖ్యమంత్రి మారడం మాత్రం ఖాయమన్నారు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ తాజ్ దక్కన్లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధికి స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ అవసరమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిత్యం పదవుల కొట్లాటలు తప్పవన్నారు. సంపద సృష్టించాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయన్నారు. ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే శాంతిభద్రతల ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. కర్ణాటక ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందన్నారు. 40 శాతం కమిషన్ అని బీజేపీ ప్రభుత్వాన్ని పక్కన పెడితే, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు చదరపు అడుగుకు 500రూపాయల వరకు బిల్డర్స్ నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ గొప్పదనం, తెలంగాణ గొప్పతనం ఇక్కడున్న వారికి అర్థం కాదన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలను చూసి మహారాష్ట్ర బిల్డర్స్ ఆశ్చర్యపోతున్నారన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో నగరంలో సంపద పెరుగుతోందన్నారు.
6 నెలలకు ఒక ముఖ్యమంత్రి – కేటీఆర్
65
previous post